సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ పర్యటన

సిరిసిల్లముచ్చట్లు:

 

 

మంత్రి కేటీఆర్ సోమవారం నాడు  సిరిసిల్ల జిల్లా లో ఆకస్మిక పర్యటన చేశారు. ముందుగా తంగళ్ళపల్లి మండలం లోని మండే పెల్లి లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తొందర్లోనే ప్రారంభించడంజరుగుతుందని ,పెండింగ్ పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ లలో నిర్మాణమవుతున్న సెంట్రల్ పార్క్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వంద ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని తొందరగా, నాణ్యతతో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈయన వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు జడ్పీ చైర్మన్  అరుణ, ఎంపీపీ పడగల మానస, జెడ్పిటిసి మంజుల, ఏ ఎంసీ, చైర్మన్ రవీందర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ స్థానిక సర్పంచ్ శివ జ్యోతి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Minister KTR’s visit to Sirisilla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *