కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్
విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు
అనంతపురము ముచ్చట్లు:
అనంతపురము జిల్లా శింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టి ఘటనపై తక్షణమే విచారణ జరిపి, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.
Tags: Minister KV Ushasreecharan visited the students of Kasturiba Gandhi
