నూతన పోలీసు స్టేషన్ ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ

సంగారెడ్డి ముచ్చట్లు :

 

సంగారెడ్డిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహుమూద్ అలీ పాల్గోన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ  కోటి రూపాయలతో అధునాతన సాంకేతిక హంగులతో భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఒకనాడు పోలీస్ స్టేషన్ కు ప్రజలు రావాలంటే భయపడే స్థితి నుండి ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థ వరకు ఏర్పాటు చేసామని అన్నారు.
ఏదయినా సంఘటన జరిగిన కొన్ని నిమిషాలలోనే పోలీసులు  బాధితులకు సహాయం అందించేందుకు 100 ను ఏర్పాటు చేశారు. పోలీసుల కోసం అధునాతన వాహనాలను, సంకేతికను రాష్ట్ర ముఖ్యమంత్రి అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ శాఖ బలోపేతానికి 1000 కోట్లు నిధులను మంజూరు చేసి పోలీస్ వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసి విజయం సాధించారు. దేశంలో ఎక్కడలేని విధంగా షి టీం ఏర్పాటు చేసింది మన రాష్ట్రమే దేశంలోనే పోలీసింగ్ వ్యవస్థలో మన రాష్టం మొదటి స్థానంలో ఉంది.  నేరాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించింది దేశం మొత్తంలో ఉన్న సిసి కెమెరాలతో మన రాష్ట్రములోని 70 శాతం కెమెరాలు ఉన్నాయని మంత్రి అన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Minister Mahmoud Ali inaugurating the new police station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *