ఆత్మకూరు నియోజకవర్గంలో  మంత్రి మేకపాటి పర్యటన

– రైతు భరోసా, సచివాలయ భవనాలు ప్రారంభం

 

నెల్లూరు ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం ఆత్మకూరు నియోజకవర్గంలో  పర్యటన చేశారు. ఇందులో భాగంగానే ఏ.ఎస్ పేట మండలంలో కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాలను మంత్రి మేకపాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగారైతు భరోసా కేంద్రం ముందు భాగం కూరగాయలతో రూపుదిద్దుకున్న సహజసిద్ధమైన రంగవల్లిని తీర్చిదిద్దినవారిని స్థానిక మహిళలను మంత్రి అభినందించారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అట్టహాసంగా,  ఏ.ఎస్ పేట మండల వైసిపి నాయకులు స్వాగత ఏర్పాట్లు చేశారు.అడుగడుగునా మంత్రికి పూల గుచ్ఛాలతో స్వాగతం పలుకుతూ, శాలువాలతో స్థానిక వైకాపా నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరంఏ.ఎస్ పేట మండలంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ అధికార యంత్రాంగం, స్థానిక నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి,  డ్వామా పీడీ తిరుపతయ్య,  రాజవోలు సొసైటీ అధ్యక్షుడు కాటంరెడ్డి నరసింహా రెడ్డి, సర్పంచ్ షేక్ తాజునిసా, ఏ.ఎస్ పేట మండల వైసీపీ నాయకులు నంది వివేకనందరెడ్డి, బోయళ్ల చెంచురెడ్డి, పద్మజ,  పులిమి వెంకట రమేశ్, సుధాకర్ రెడ్డి,మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Minister Mekapati visits Atmakuru constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *