ధాన్యం రైతులతో మంత్రి మేకపాటి

Date:19/09/2020

నెల్లూరు ముచ్చట్లు:

ఇటీవల నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా సంగం మండల ప్రాంతం లో ధాన్యం కొనుగోలు పై రైతులు నిరసన చేపట్టడంతో సంగం మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేడు సందర్శించారు.. ఈ సందర్భంగా మేకపాటి గౌతం రెడ్డి రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న దాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తుందని దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని రైతులకు సూచించారు.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమానికి వచ్చిన ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల తో మంత్రి మేకపాటి మాట్లాడుతూ మీరు తప్పనిసరిగా రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఇతర జిల్లాల నుండి మిల్లర్లను పిలిపించి జిల్లాలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వారిని హెచ్చరించారు..

 

మహిళ అనుమానస్పదస్థితిలో మృతి

Tags:Minister Mekapati with grain farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *