అవినీతిలో మోడీ ప్రభుత్వానిది నెంబర్ 1 ర్యాంకా?మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి

Minister N Amarnath Reddy is the number 1 rank of Modi government in corruption

Minister N Amarnath Reddy is the number 1 rank of Modi government in corruption

Date:13/07/2018
 అమరావతి  ముచ్చట్లు:
ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం దక్కడంపై కొందరు బీజేపీ నాయకులు విమర్శలు చేయడం బాధాకరమని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి అన్నారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిఐపిపి సంయుక్తంగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 98.42 శాతంతో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం దక్కింది. అయితే ఏపికి చెందిన కొందరు బీజేపీ నాయకులు అవినీతిలో ఏపికి రెండో ర్యాంకు అని మాట్లాడుతున్నారు. ఏపిది రెండో ర్యాంకు అయితే మొదటి ర్యాంకు మోడీ ప్రభుత్వానిదా అని ఎద్దేవా చేశారు. విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకొని అవినీతికి తావే లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారన్నారు. పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ర్ట భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్కరణలు చేపట్టారని తెలిపారు. 2015లో 285 సంస్కరణలు, 2016లో 340 సంస్కరణలు, 2017లో 372 సంస్కరణలు అమలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో అమలు చేసిన సంస్కరణల కారణంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపికి 2015లో రెండోస్థానం 2016లో తెలంగాణ రాష్ర్టంతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా, ఈసారి విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం జరిగిందన్నారు. విభజనతో నష్టపోయిన ఏపిని ఆభివృద్ధి వైపు నడిపిస్తుంటే విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు.  ఎంప్లాయిమెంట్ కు సంబంధించిన సంస్కరణలో జరిగిన చిన్న తప్పిదం కారణంగా 1.5 శాతం మార్కులు తగ్గాయని, ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా ఇదే స్ఫూర్తితో పనిచేసి డిస్టెన్స్( వందకు వంద మార్కులు) నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.పది లక్షల మందికి ఉపాధి కల్పించాం : గడిచిన మూడేళ్లలో భారతదేశంలో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని మంత్రి అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. గత మూడేళ్ల కాలంలో పరిశ్రమల శాఖకు సంబంధించి రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించిన ఎంఓయులు చేసుకోవడం జరిగిందన్నారు. వీటి ద్వారా 32 లక్షల మందికి ఉపాధి దక్కనుందని తెలిపారు. ప్రస్తుతం రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించిన పరిశ్రమలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయని, వీటి ద్వారా పది లక్షల మందికి ఉపాధి దక్కిందని మంత్రి స్పష్టం చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు.
అవినీతిలో మోడీ ప్రభుత్వానిది నెంబర్ 1 ర్యాంకా?మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి https://www.telugumuchatlu.com/minister-n-amarnath-reddy-is-the-number-1-rank-of-modi-government-in-corruption/
Tags:Minister N Amarnath Reddy is the number 1 rank of Modi government in corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *