ఫస్ట్ ఇండియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ

Date:15/02/2018
అమరావతి ముచ్చట్లు:
ల్యాండ్ రికార్డ్స్ అన్ని డిజిటైజ్ చేస్తున్నాం. టాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ల్యాండ్ రికార్డులన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజి వేదిక పైకి తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం నాడు అయన ఫస్ట్ అమెరికా (ఇండియా) వైస్ ప్రెసిడెంట్ రఘు,సీనియర్ మ్యానేజర్  శ్రీనివాస్ రావులతో  భేటీ అయ్యారు. ఫస్ట్ ఫస్ట్ అమెరికన్ సంస్థ టైటిల్,  ఇన్సూరెన్స్ సర్వీసెస్,మోర్టగేజ్,  హోమ్ వారంటీ లాంటి సేవలందిస్తోంది. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసాం.149 రూపాయిలకే వైఫై,ఇంటర్నెట్,టెలివిజన్ అందిస్తున్నాం. సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ తీసుకొస్తున్నామని అన్నారు.  ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చెయ్యడం ద్వారా 20 శాతం వృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. ఫైబర్ గ్రిడ్ ని వినియోగించుకొని గ్రామాల్లో యువతి,యువకులు వారి ఇంటి నుండే పని చేసుకునేలా ఒక మోడల్ అభివృద్ధి చెయ్యండి.దీని వలన మీకు ఆపరేషన్ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇచ్చి,డ్వాక్రా గ్రూప్ మహిళలు,గృహిణులు ఇంటి నుండే పనిచేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించండని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ఏర్పాటు చెయ్యాలని ఆహ్వానించారు. ఫస్ట్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి పనిచేస్తాం. ఫైబర్ గ్రిడ్ ని ఉపయోగించుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ పైలెట్ ప్రొజెక్ట్ కొన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని అన్నారు. దీని వలన గ్రామాల్లో మహిళలు,యువత ఇంటి నుండే పనిచేసుకొని ఆదాయం పొందవచ్చు. ఎపిటిఎస్ తో భాగస్వామ్యం అయ్యి గన్నవరం లో చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంని అన్నారు.  త్వరలోనే విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తామని అన్నారు. ఇంటి నుండి పనిచేస్తూ ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజ్ చేసే కార్యక్రమం విజయవంతం అయితే ఇతర రాష్ట్రాలు,ఇతర దేశాల ల్యాండ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ నుండి చేసే అవకాశం వస్తుంది.దీని వలన ఎంతో మందికి ఇంటి నుండే పనిచేసుకునే విధంగా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయయని అన్నారు.
Tags: Minister Nara Lokesh with first India counterpart

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *