పాఠశాలలను పరిశీలించిన మంత్రి నారాయణ 

Minister Narayana examined schools

Minister Narayana examined schools

Date: 17/07/2018
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని మునిసిపల్ పాఠశాలలను మంత్రి నారాయణ మంగళవారం నాడు సందర్శించారు. నగర పరిధిలోని అన్ని పాఠశాలలను సందర్శించాలన్న లక్ష్యం తో  సాయంత్రం వరకు పర్యటన కొనసాగింది. ప్రధానంగా మున్సిపల్ ప్రైమరీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై మంత్రి దృష్టిసారించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి బోధించడం శాస్త్రీయమైన విధానం కాదు. ప్రతి తరగతికి ఒక ప్రత్యేకమైన గది, ఆటస్థలం, ల్యాబ్ సౌకర్యం, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ స్టాఫ్ రూమ్ వంటివి ప్రతి పాఠశాలకు అవసరమని అన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో 160 తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉంది.  సర్వ శిక్ష అభియాన్ వారు 6 కోట్లతో 60 తరగతి గదులు నిర్మిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 3 కోట్ల నిధులతో 30 తరగతి గదులు నిర్మిస్తున్నారు. మున్సిపల్ శాఖ నుండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 7 కోట్లతో మిగిలిన తరగతి గదులు నిర్మిస్తామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో టాయ్లెట్లను అద్భుతంగా నిర్మించాం. అదే విధానంలో రాష్ట్రమంతటా మున్సిపల్ పాఠశాలల్లో టాయ్లెట్లను నిర్మిస్తాం. రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ పాఠశాలలను మౌలిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికమీద చేపట్టామని అన్నారు. నాలుగు నెలల కాలపరిమితి లో తరగతి గదులు మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను అన్ని పాఠశాలలకు కల్పిస్తామని మంత్రి అన్నారు.
పాఠశాలలను పరిశీలించిన మంత్రి నారాయణhttps://www.telugumuchatlu.com/minister-narayana-examined-schools/
Tags: Minister Narayana examined schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *