పట్టణ ప్రగతిలో మంత్రి నిరంజన్ రెడ్డి

Date:01/06/2020

వనపర్తి ముచ్చట్లు:

ప్రతి గల్లీని ఇంటిలాగే శుభ్రంగా ఉంచుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాయ్ గడ్డ ఒకటవ వార్డులో సోమవారం ఉదయం రెండవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వార్డులోని కాలనీల్లో పాదయాత్ర చేపట్టి.. కాలనీ వాసులతో మాట్లాడుతూ, స్థానిక సమస్యలపై ఇంటి గృహిణీలతో…తడి, పొడి, హానికర చెత్త అంటే ఏమిటనే అంశాల గురించి ఆరాతీశారు. ఇంటి మాదిరిగా ప్రతీ గల్లీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆదర్శ పట్టణాలు తయారవుతాయన్నారు.  మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీరు వెళ్లి పోయేలా చూడటం, రోడ్ల వెంట పిచ్చిమొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించడం లాంటివి చేసి రానున్న వర్షాకాల సీజన్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

దోమలు, వాటి లార్వాను నిర్మూలించేందుకు నివాసిత ప్రాంతాల్లో స్ర్పేయింగ్, ఫాగింగ్ లాంటివి చేపట్టాలని, ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచేలా చూడాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఇళ్ల పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమిషాల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు భాగస్వామ్యం కావాలన్నారు. కాలనీల్లో ఇంటింటా సేకరిస్తున్న చెత్తలను ఇంటి గృహిణీలతోనే తడి, పొడి, హానికర చెత్తలను వేర్వేరుగా విభజన చేయించి, కాలనీ ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్యం పై అవగాహన కల్పించాలన్నారు.

రేపు దిల్లీకి ఏపీ సీఎం జగన్‌  

Tags: Minister Niranjan Reddy on urban development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *