వసతి గృహాలను పరిశీలించిన మంత్రి ప్రత్తిపాటి

Minister observed accommodation of dorm

Minister observed accommodation of dorm

Date:15/09/2018
గుంటూరు ముచ్చట్లు:
చిలకలూరిపేట పట్టణంలోని బి.సి బాలురు, ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహాలలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం ఆకస్మీక తనిఖీలు చేసారు. బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 65 మంది ఉండటంపై వార్డెన్ను ప్రశ్నించారు. మరుగుదొడ్ల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఒక్క విద్యార్థిని కూడా లేకుండా జీతాలు తీసుకోవడంపై  అయన  ఆశ్చర్యం వ్యక్తం చేసారు. వసతి గృహం అధికారి నెలకు రూ. 35 వేలు నుంచి 40 వేలు వరకు జీతాలు తీసుకుంటున్నారు.  ఈ  విషయాన్నిజిల్లా కలెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు.
ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా 42 వసతి గృహాల్లో విద్యార్థులు లేకుండా జీతాలు తీసుకుంటున్నట్లు మంత్రికి  అధికారులు వివరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ ఆధికారుల లోపం వల్ల పేద విద్యార్థులకు అందాల్సీన సౌకర్యాలు అందటం లేదు.
ప్రభుత్వం హాస్టల్స్ నిర్వహణకు వేలాది కోట్ల రూపాయను ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం ఎడ్యుకేషన్కు రూ. 23 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందరి అన్నారు.
Tags; Minister observed accommodation of dorm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *