బ్రాహ్మణుల స్మశాన వాటిక అబివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి హామి

Minister of Development of the Brahmin Cemetery

Minister of Development of the Brahmin Cemetery

Date:20/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బ్రాహ్మణుల స్మశాన వాటిక అబివృద్ధికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామి ఇచ్చారని సంఘ అధ్యక్షుడు మదుకుమార్‌శర్మ తెలిపారు. ఆదివారం బ్రాహ్మణ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ బ్రాహ్మణుల స్మశానవాటికకు ప్రహారీ, ఒక భవనము, మంచినీరు సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే ప్రహారీ, భవనము, నీటి సౌకర్యం మంజూరు చేస్తూ కమిషనర్‌ కెఎల్‌.వర్మకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బ్రాహ్మణులు మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నోఏళ్లుగా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి కృషితో బ్రాహ్మణుల సమస్య తీరిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కోదండరామయ్య, ఉపాధ్యక్షులు కెవి.రమణరావు, రామకృష్ణ, సభ్యులు అశ్వర్థనారాయణ, రాము, కృష్ణమూర్తి, నారాయణరావు, సుధాకర్‌రావు, మురళి, రాజేష్‌, కుమార్‌, చంద్రయ్య, దేవభూషణం, రామ్మూర్తి, గిరి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

Tags: Minister of Development of the Brahmin Cemetery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *