కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి

బేతంచర్ల ముచ్చట్లు:

 

బేతంచర్ల పట్టణంలోని బుగ్గన శేషారెడ్డి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ అసుపత్రిని ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి  తాత అయిన  బుగ్గన శేషారెడ్డి మండల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 1952 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.  ఆస్పత్రి శిథిలావస్థకు చేరడంతో ఆర్థిక శాఖ మంత్రి చొరవతో రెండు కోట్ల 20 లక్షల వ్యయంతో ఆస్పత్రి ఆధునీకరణ పనులు పూర్తి చేశారు.  ఇందులో ఆధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. దీనిని పరిశీలించిన ఆర్థికశాఖమంత్రి ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మణిదీప్ జిల్లాని సామూ, ఆర్థిక శాఖ మంత్రి పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి,  వైద్య ఆరోగ్య శాఖ డిస్టిక్ కో ఆర్డినేటర్ లింగన్న, డాక్టర్ విజయలక్ష్మి,  వైయస్సార్ సిపి నాయకులు నాగభూషణం రెడ్డి,  బాబు రెడ్డి,  బుగ్గన ప్రభాకర్ రెడ్డి,  మూర్తి జావళి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Minister of Finance who inaugurated the Community Health Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *