జర్నలిస్టు పార్థసారథి కుటుంబానికి మంత్రి పెద్ది రెడ్డి ఆర్థిక సహాయం

Date:13/07/2020

తిరుపతి ముచ్చట్లు:

Minister Paddy Reddy provides financial assistance to the family of journalist Parthasarathy

రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతొ చిత్తూరు వైయస్సార్ జిల్లా పార్టీ తరఫున  రాష్ట్ర పంచాయతి రాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖామంత్రి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి  చేతుల మీదుగా ఆకాల మరణం చెందిన సివిఆర్ సీనియర్ వీడియో జర్నలిస్టు పార్థసారథి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు నగదు రూపంలో ఆర్థిక సహాయం అందించారు.రెండు దశాబ్దాలపాటు మీడియా లో వివిధ రంగాలలో వీడియో జర్నలిస్ట్ గా పనిచేసిన పార్థసారథి మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి వైయస్సార్ సిపి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని,వారి కుటుంబం మనో ధైర్యంతో ఉండాలని,శ్రీ వారి చెంత పనిచేసిన పార్థసారథి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.విధి నిర్వహణ లో జర్నలిస్టులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తం గా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర వైయస్సార్ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్ కుమార్, డిపిఆర్ఓ పద్మజ పాల్గొన్నారు.

భార‌త్‌లో 23వేలు దాటిన కొవిడ్ మ‌ర‌ణాలు!

Tags:Minister Paddy Reddy provides financial assistance to the family of journalist Parthasarathy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *