Minister Paddy Reddy Ramachandra Reddy presented silk garments to Boyakonda Gangam

బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

Date:24/10/2020

చౌడేపల్లి ముచ్చట్లు:

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివ్రుద్ది మరియు భూ గర్భ మరియు గనులు శాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శనివారం చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ బోయకొండపై వెలిసి ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి చేరుకొన్న మంత్రి దంపతులకు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంబంతో ఆలయ ఈ ఓ. చంద్రమౌళి అర్చకులు మంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు మంత్రి దంపతులచే కుంకుమ అర్చన, ప్రత్యేక పూజలు చేయించి, మంత్రి దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేసి అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మ వారి హోమం కార్యక్రమంలో మంత్రి దంపతులు పాల్గొన్నారు. బోయకొండ గంగమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ప్రతి సంవత్సరం దసరా మహోత్సవం సందర్బంగా అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ లో భాగంగా ఈ రోజు మా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొన్నారు. మంత్రి సతీమణి స్వర్ణలత (స్వర్ణమ్మ), రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి.మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. రెడ్డెప్ప, తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మెంబర్ విశ్వనాథమ. పాల ఏకల కార్పొరేషన్ చెర్మన్ మురళి. కాపు నాయకుడు పోకల అశోక్ కుమార్, పుంగనూరు మాజీ మున్సిపల్ చెర్మన్ కొండవీటి నాగ భూషణం, తహశీల్దార్,ఎం.పి.డి.ఓ, ఆలయ సిబ్బంది, వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: Minister Paddy Reddy Ramachandra Reddy presented silk garments to Boyakonda Gangam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *