కార్తీకపౌర్ణమి పూజల్లో పాల్గొన్న మంత్రి

Minister participated in the Kartik Poornima Puja
Date:23/11/2018
పెద్దపంజాణి ముచ్చట్లు:
పెద్దపంజాణి మండలం లోని వీరపల్లె గ్రామంలో వెలసిన యోగానందీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో శుక్రవారం పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మంత్రి హాజరైనారు. ఈ సందర్భంగా సాంప్రదాయ బద్దంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని వర్షాలు విరివిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇంట్లోంచి 10 లక్షలు కాజేసిన భార్య
Tags:Minister participated in the Kartik Poornima Puja