చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్
పుంగనూరు ముచ్చట్లు:
వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. ఆదివారం వారు వేరువేరు ప్రకటనలలో ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా వినాయకుడిని ప్రజలందరు ప్రార్థించాలని , రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు.

Tags: Minister Peddi Reddy and MP Mithun
