డయాలసిస్‌ సెంటర్‌కు మంత్రి పెద్దిరెడ్డి రూ.10 లక్షలు విరాళం

Minister Peddi Reddy donates Rs 10 lakh to dialysis center

Minister Peddi Reddy donates Rs 10 lakh to dialysis center

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో నిర్మించిన డయాలసిస్‌ ఆసుపత్రికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.10 లక్షలు విరాళం అందజేశారు. బుధవారం లయన్స్ క్లబ్  జిల్లా పీఆర్‌ వో డాక్టర్‌ శివ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.1.60 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో ఆరు డయాలసిస్‌ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు మిషన్లు కొనుగోలు చేసేందుకు మంత్రి విరాళంగా రూ. 10 లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. అలాగే డయాలసిస్‌ సెంటర్‌ ద్వారా కిడ్నిరోగులకు సేవలు అందించేందుకు ఆసుపత్రిని ప్రభుత్వానికి అప్పగించేందుకు  లయన్స్ క్లబ్  సిద్దంగా ఉన్నామని మంత్రికి తెలిపామన్నారు. ఈ మేరకు మంత్రి ఆరోగ్యశాఖ కార్యదర్శితో మాట్లాడారని , దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారని డాక్టర్‌ తెలిపారు.

విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రెడ్డెప్ప

Tags: Minister Peddi Reddy donates Rs 10 lakh to dialysis center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *