అవినీతిపై మంత్రి పెద్దిరెడ్డి కొరడ

Minister Peddi Reddy's scourge on corruption

Minister Peddi Reddy's scourge on corruption

-ఎంఈవో లీలారాణి సస్పెన్షన్‌

Date:13/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంలో అవినీతి అధికారులపై కొరడ జూలిపించారు. ఈ స్రంఘటనతో అవినీతి అధికారులకు మంత్రి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టమౌతోంది. ఇందులో భాగంగా తీవ్ర అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న మండల విద్యాశాఖాధికారి లీలారాణిని సస్పెండ్‌ చేస్తూ కడప రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె స్థానంలో చౌడేపల్లె ఎంఈవో కేశవరెడ్డిని ఇన్‌చార్జ్గా నియమించారు.   విద్యాశాఖ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబ‌రు 13న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

Tags: Minister Peddi Reddy’s scourge on corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *