Minister Peddi Reddy's tribute to the zamindar queen

జమీందారు రాణిసుందరమ్మణ్ణికి మంత్రి పెద్దిరెడ్డి నివాళి

-జమీందారిణికి కన్నీటి వీడ్కోలు
– తరలివచ్చిన జనం

Date:05/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జమీందారిణి , మాజీ ఎమ్మెల్యే రాణిసుందరమ్మణ్ణి భౌతికకాయాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం సందర్శించి ఘన నివాళులర్పించారు. పుంగనూరు సంస్థాన అధిపతి రాజవీరబసవ చిక్కరాయల్‌ భార్య అయిన రాణిసుందరమ్మణ్ణి గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతు శనివారం బెంగళూరులో మృతి చెందారు. భౌతికకాయాన్ని పుంగనూరుకు తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ప్యాలెస్‌లో ఉంచారు. మంత్రి తిరుపతి నుంచి వచ్చి నివాళులర్పించారు. ఆయనతో కలసి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చై ర్మన్‌ అమరేంద్ర , కమిషనర్‌ కెఎల్‌.వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుంగనూరు జమీందారులు తమ పాలనలో కోట్లాది రూపాయలు విలువ చేసే పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను, ఆ ప్రాంతాల్లోని భూములను విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జమీందారులు లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

పలువురు సంతాపం…

జమీందారు రాణిసుందరమ్మణ్ణి మృతి వార్త తెలియగానే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమ్యిధున్‌రెడ్డి సంతాపం తెలిపారు. అలాగే మాజీ మంత్రి అమరనాథరెడ్డి , మాజీ ఎమ్మెల్యే బగ్గిడిగోపాల్‌, మాజీ ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి సంతాపం తెలిపారు.

దహనక్రియలు…

జమీందారు రాణిసుందరమ్మణ్ణి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది పట్టణ ప్రజలు కన్నీటితో రాణిసుందరమ్మణ్ణి భౌతికకాయానికి వీడ్కోలు పలికారు. ఈ విషాద వార్త తెలసినా కరోనా కారణంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి ప్రజలు రాలేకపోయారు.

పుంగనూరు జమీందారిణి రాణిసుందర మ్మణ్ణి మృతి

Tags: Minister Peddi Reddy’s tribute to the zamindar queen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *