రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు భక్తి శ్రద్దలతో ప్రార్థనలు నిర్వహించి పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో జరుపుకోవాలని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి కోరారు. శుక్రవారం వారు వేరువేరుగా మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముస్లింమైనార్టీల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని , వారిని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.

Tags: Minister Peddireddy and MP Midhun Reddy greeted Ramzan
