Natyam ad

శ్రీ బోయకొండలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లు చేసిన మంత్రిపెద్దిరెడ్డి,స్వర్ణలత దంపతులు

చౌడేపల్లి ముచ్చట్లు:

దసరా నవరాత్రుల నేపద్యంలో శ్రీ బోయకొండ గంగమ్మ కు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,   స్వర్ణలత దంపతులుఅనంతరం శ్రీ రణభేరి గంగమ్మ ను దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,   స్వర్ణలత దంపతులు.ఈ నేపద్యంలో ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవలు, శంఖుస్థాపన లు చేసిన మంత్రి.భక్తులు సౌకర్యార్థం 32 లక్షల రూపాయలతో నిర్మించిన పెద్ద భోగ మండపం ప్రారంభం.భక్తులకు చండీ హోమం, ఆశీర్వాదం అందించుటకు 45 లక్షల రూపాయలతో నిర్మించిన యాగశాలలో కూడిన ఆశీర్వాద మండపం ప్రారంభం.25 లక్షల రూపాయలతో నిర్మించిన సెక్యూరిటీ గార్డ్ భవనం ప్రారంభోత్సవం.ఆలయ భద్రత దృష్ట్యా కంట్రోల్ రూం, పోలీస్ ఔట్ పోస్ట్ కు అనుసందిస్తూ 150 సీసీ కెమెరాలు ఏర్పాటు

Post Midle

సీసీ కెమెరాల కంట్రోల్ రూం ను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.75 లక్షల రూపాయలతో అదనపు పార్కింగ్ కోసం నిర్మించిన ప్రాంతాన్ని ప్రారంభించిన మంత్రి.మొత్తం 54 లక్షల రూపాయలతో నిర్మించిన 9 స్వాగత తోరణాలను ప్రారంభించిన మంత్రి

50 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి.54 లక్షలు, 17 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న ముఖద్వారములకు భూమి పూజ చేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

బోయకొండ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం.నూతనంగా ఎన్నికైన బోయకొండ నూతన పాలక మండలి కి అభినందనలు.ఎన్నికల లోపు పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేయాలని కోరుతున్నా.మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ ఆలయ అభివృద్ధి పై దృష్టి సారించారు

గతంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా అభివృద్ధి చేసుకోలేకపోయాం.సిఎం  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, వారి సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం.కుళాయి ద్వారా ఇంటింటికీ నీరు అందిస్తాం.మన ప్రాంత నీటి కష్టాలు చూసి సిఎం  వైఎస్ జగన్ మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు.వాటిని కూడా చంద్రబాబు కేసులు వేసి అడ్డుకున్నారు… త్వరలో కేసులు తొలిగిపొతే మళ్ళీ పనులు మొదలవుతాయి.మనం అధికారంలోకి వచ్చాకే పుంగనూరు లో బస్సు డిపో నిర్మించాం.ప్రజలందరూ సీఎం  వైఎస్ జగన్ కు అండగా నిలవాలి.బూటకపు హామీలతో చంద్రబాబు మానిఫెస్టో తీసుకొస్తారు

హామీలు నిలబెట్టుకునే అంశంలో  వైఎస్ జగన్ ను చంద్రబాబు ను బేరీజు వేసుకుని ఓటు వేయాలి.సిఎం వైఎస్ జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుంది.

 

 

Tags: Minister Peddireddy and Swarnalatha laid the foundation stones for development works in Sri Boyakonda.

Post Midle