Minister Peddireddy arrives at Boyakonda on the 24th

24న బోయకొండకు మంత్రి పెద్దిరెడ్డి రాక

– అమ్మవారికి పట్టువలు సమర్పణ
– ఇద్దరు ఎంపీలు, పలువురుఎమ్మెల్యేలురాక

Date:23/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

పుణ్యక్షేత్రమైన శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా మహ్గత్సవాలను పురస్కరించుకుని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం బోయకొండకు రానున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు మంత్రి దంపతులచే కుటుంబ సమేతంగా అమ్మవారికి ఆలయ సాంప్రదాయల ప్రకారం పట్టువలను అందజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు చౌడేపల్లె మండల వైఎస్‌ఆర్‌సీపీ నే తలు మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలుకుతూ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు,పెద్దిరెడ్డి అభిమానులు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేసేయాలని కోరారు.

ఘనంగా సినీ నటుడు ప్రభాస్ 41వ పుట్టినరోజు వేడుకలు

Tags: Minister Peddireddy arrives at Boyakonda on the 24th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *