Natyam ad

పుంగనూరులో వివాహ వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని మార్లపల్లెలో మాజీ సర్పంచ్‌ ఆంటోనిరాజ్‌ కుమారై వివాహ వేడుకల్లో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని వధువరులను ఆశీర్వధించారు. బుధవారం పట్టణ పర్యటనలో ఉన్న మంత్రి వివాహ వేడుకల్లో ఎంపీ రెడ్డెప్ప, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులతో కలసి పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని మైనార్టీల నాయకుడు ఖాజా ఆనారోగ్యానికి గురైయ్యారు. మంత్రి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ చెంగారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, వక్ప్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags; Minister Peddireddy at the wedding ceremony in Punganur