Natyam ad

పులిచర్ల లో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం

పులిచర్ల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం.ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో పూర్తయిన పంచాయతీల పర్యటన.అన్ని పంచాయతీల్లో ప్రజలను కలిసి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం ను వివరిస్తున్న మంత్రి.నేడు, రేపు పులిచర్ల మండలంలోని 25 పంచాయతీల్లో పర్యటిస్తున్న మంత్రి.నేడు 13 పంచాయతీల పరిధిలో ప్రచారం, రేపు 12 పంచాయతీల్లో కొనసాగానున్న ప్రచారం.ఎమ్మెల్యేగా తనను, ఎంపి గా  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కి భారీ మెజారిటీ అందించాలని కోరిన మంత్రి.

Post Midle

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

రాష్ట్రం లో సిఎం  వైఎస్ జగన్ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారు.ఎన్నికల హామీలు అన్ని దాదాపుగా పూర్తి చేశారు.ఎన్నికల్లో ఈ స్థాయిలో హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రిని నా రాజకీయ జీవితంలో చూడలేదు.ఏ ముఖ్యమంత్రి అయినా కేవలం ఎన్నికలకు 6 నెలలు, ఏడాది లోపే ఒకటి రెండు హామీలు తీర్చే వారు.కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం  వైఎస్ హామీలు అమలు పై దృష్టి సారించారు.సిఎం  వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం పై ప్రచారం చేస్తున్నారు.అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి మాత్రం గతంలో ఏమి చేశాం, గెలిస్తే ఏం చేస్తామో చెప్పట్లేదు.ప్రతి సమావేశంలో సిఎం  వైఎస్ జగన్ ను విమర్శించడం మాత్రమే పని గా పెట్టుకున్నారు.

 

 

ఆయన భవిష్యత్తు కే గ్యారెంటీ లేక చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారు.భవిషత్తు లేని చంద్రబాబు ప్రజల భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తారట.తెలంగాణలో ఓటుకు కోట్లు స్కాం లో దొరికిపోయి, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదారాబాద్ ను వదిలి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చారు.ఇక్కడ అమరావతి అని చెప్పి ఆయనే తాత్కాలిక రాజధాని నిర్మించమని తెలిపారు.లోకేష్ ఎర్ర బుక్కు అంటూ వైసీపీ నాయకులను బ్లాక్ మెయిల్ చేసే పనిలో ఉన్నారు.చిత్తూరు జిల్లాకు వస్తె ఆ బుక్కులో మొదటి పేరు పెద్దిరెడ్డి దే అంటారు, మరో జిల్లాలో మరో పేరు చెప్తారు.ఆయన బెదిరింపులకు వైసిపి నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదు.రెండేళ్లు కరోనా తో నష్ట పోయినా కూడా ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చిన ఘనత  వైఎస్ జగన్ ది.ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు.గతంలో 600 హామీలు ఇచ్చారు… ఒక్కటైన పూర్తిగా నిలబెట్టుకున్నారా ?

 

 

రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు.ఇప్పుడు మళ్ళీ సుపర్ సిక్స్ పేరుతో మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారు.పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని కూడా చంద్రబాబు అడ్డుకున్నారు.మన ప్రాంతంలో సాగు, తాగు నీరు ఇబ్బందులని అధిగమించేందుకు మొత్తం మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.సుప్రీం కోర్టు వరకు వెళ్లి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నారు.ఎన్నికల్లో మన ఓటు ద్వారా చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాలి.ఎమ్మెల్యేగా నన్ను, రాజంపేట ఎంపి గా  మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.మన కోసం ఇంత మంచి పాలన అందిస్తున్న  వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి గా గెలిపించాలి.సిఎం  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మరో అయిదేళ్లు మన కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళతాయి.

 

Tags:Minister Peddireddy election campaign in Pulicharla

Post Midle