సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కును ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పంపిణీ చేశారు. పుంగనూరు పట్టణానికి చెందిన సి.బాలాజికి రూ.5 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. అలాగే పులిచెర్లకు చెందిన కేశవులకు రూ.30 వేలు, రామసముద్రంకు చెందిన యాస్మిన్‌కు రూ.2లక్షలు చెక్కులను బాధితులకు అందజేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందిస్తూ , పేద రోగులకు సీఎం సహాయనిధి వరంగా మారిందని కొనియాడారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Minister Peddireddy handed over the CM Relief Fund check

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *