Natyam ad

శ్రీఅగస్తీశ్వరస్వామి సేవలో మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం శ్రీఅగస్తీశ్వరస్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా మంత్రి ఆలయానికి రాగానే ఆలయ కమిటి చైర్మన్‌ రామనారాయణరెడ్డి, బోయకొండ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, వేదపండితులతో కలసి మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రికి ఆశీర్వాదాలు అందించారు. మంత్రి పెద్దిరెడ్డి పుష్కరిణి పనులను, కళ్యాణ మండపం , విశ్రాంతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, చౌడేపల్లె జెడ్పిటిసి దామోదర్‌రాజు, సచివాలయాల కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Post Midle

Tags; Minister Peddireddy in the service of Sri Agastishwaraswamy

Post Midle