పుంగనూరులో శ్రీసాయినాథుని సేవలో మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర విద్యుత్‌, అటవీ, గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం రాత్రి పుంగనూరులో పర్యటించారు. కొత్తయిండ్లు శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆర్చినిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. రాగానిపల్లె శ్రీనివాసులురెడ్డి కుమారుడి వివాహా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే మాగాండ్లపల్లె శ్రీరాములురెడ్డి కుమారై వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్‌ త్రిమూర్తిరెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Peddireddy in the service of Sri Sainath in Punganur

Leave A Reply

Your email address will not be published.