Natyam ad

శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సుమారు రూ.3 కోట్లరూపాయలతో నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌, విగ్రహావిష్కరణను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఆదివారం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం, కాప్‌రాక్స్ యూత్‌ సభ్యులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, కాపుకార్పోరేషన్‌ చైర్మన్‌ అడపశేషు, టీటీడీ మాజీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌లు అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు వేలాది మంది హాజరై మంత్రి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. మంత్రి పెద్దిరెడ్డి, అడపశేషు, ఎమ్మెల్యేలకు మెమెంటోలు ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రాంగణాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా పుంగనూరు పరిసరాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రారంభించడం అదృష్టమన్నారు. పుంగనూరు ప్రధాన రహదారి కూడలీ భీమగానిపల్లె వద్ద శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌ ఏర్పాటుతో పుంగనూరుకు ఎంతో కీర్తి చేకూరుతుందని కొనియాడారు. ఇంతటి మహాత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బలిజ కులస్తులందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ జింకా వెంకటాచలపతి, తిరుపతి బలిజ సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి, సంఘ ప్రతినిధులు ఆకుల గజేంద్ర, గణేష్‌, త్యాగరాజు, రమణ, మనోహర్‌, కుమార్‌, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Minister Peddireddy inaugurated the statue of Sri Krishna Devaraya

Post Midle