చౌడేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
చౌడేపల్లి ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.సుమారు 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం, పలు నూతన పనులకు శ్రీకారం.9.54 కోట్ల రూపాయలతో బోయకొండ ఆర్చ్ నుండి గంగమ్మ ఆలయం వరకు వేసిన తారు రోడ్డు ను ప్రారంభించిన మంత్రి.బయకొండ వద్ద 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఏకో టూరిజం పార్కు కు భూమి పూజ చేసిన మంత్రి.38 లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ కట్టని ప్రారంభించిన మంత్రి.అదే విధంగా భవానీ నగర్ నుండి 32 లక్షల రూపాయలతో చేసిన విద్యుద్దీకరణ పనులు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

అదేవిధంగా 21.5 లక్షల రూపాయలతో చౌడేపల్లి వద్ద ఉన్న అవుల చెరువు ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి.50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మొత్తం 10 ఆర్.ఓ ప్లాంట్ల ను ప్రారంభించిన మంత్రి.చౌడేపల్లి లో రెండు, దిగువపల్లి లో రెండు, అమనిగుంట, కొండమర్రి, కాగతి, కాటిపేరి, పుదిపట్ల, పెద్దయళ్లకుంట లో అర్.ఓ ప్లాంటులు ప్రారంభం.
Tags:Minister Peddireddy initiated many development programs in Chaudepally
