పుంగనూరులో రాజన్న కు నివాళులర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 


దివంగతముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సంధర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘన నివాళులర్పించారు.గురువారం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండ వీటి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిభిరాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు.ఈ సంధర్భంగా వృద్దులకు , పిల్లలకు, కంటి అద్దాలను పంపిణీ చేశారు.అలాగే రోగులకు మందులను పంపిణీ చేశారు. మండలంలోని సుగాలిమిట్టలో ఏర్పాటుచేసిన రక్తధాన శిభిరాన్ని కూడా మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వెయ్యి దాటితే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తూ రోగులకు ఉచితంగా సేవలను అందిస్తోందన్నారు.అలాగే కంటి జబ్బుల నివారణ కోసం చిన్నపిల్లలకు, వృధ్దులకు ముందుగా పరీ క్షలు చేసి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చైర్మన్‌ అలీమ్‌ భాషా,డిఅండ్‌ఎంహెచ్‌ఓ శ్రీహరి,కమీషనర్‌ కెఎల్‌ వర్మ,కోవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణరైతుల ముంగిటకే ప్రభుత్వ సేవలు- మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

Tags: Minister Peddireddy paying homage to Rajanna in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *