బోయకొండఅమ్మవారికి పట్టువలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
— మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే ద్వాకరనాథరెడ్డి
–ప్రముఖుల నడుమ సాంప్రదాయ రీతిలో స్వాగతం
— వేదపండితులచే మంత్రి దంపతులకు ఆశీర్వచనం
–రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని పూజలు
చౌడేపల్లె ముచ్చట్లు:

రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని, పంటలు భాగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,మంత్రి సతీమణి స్వర్ణమ్మ దంపతులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ భరత్, టిటిడి పాలక మండళి సభ్యుడు పోకల అశోక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ లు సమర్పించారు. వీరిని ఆలయ కమిటి చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలు ఆలయ మర్యాధలతో మేళ తాళాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయంలో దుర్గాదేవి అలంకారంలో కొలువు తీరిన అమ్మవారికి మంత్రి పెద్దిరెడ్డి దంపతులు వేదపండితుల సమక్షంలో ప్రత్యేక అభిషేక పూజలు,అర్చనలు,నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మవారిని వేడుకొన్నారు.ఆలయంలో గల అమ్మవారి ఉత్సవమూర్తికు పూజలు చేసి ఊంజల్ సేవలో పాల్గొన్నారు. ప్రధాన గర్భాలయం క్రింద ఉన్న మూల స్థానం అమ్మవారికి పూజలు చేశారు.ఊయ్యాల ఊపుతూ అమ్మవారిని స్మరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిలకు పూజలు చేసి హ్గమ పూజల్లో మంత్రి, ఎమ్మెల్యే, ప్రముఖులు పాల్గొన్నారు. పూజల అనంతరం పూర్ణాహుతి చేశారు. వేదపండితులచే మంత్రి పెద్దిరెడ్డి దంపతులతో పాటు, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, తదితరులను ఆశీర్వాదం చేయించారు. అనంతరం చైర్మన్ శంకర్‌నారాయణ అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండళి సభ్యులు రమేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, పూర్ణిమ, ఈశ్వరమ్మ, శ్రావణి, ఎక్స్అఫిషియోమెంబర్ గంగిరెడ్డిలతోపాటు జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి,మాజీ ఎంపీపీలు రెడ్డిప్రకాష్,అంజిబాబు, రుక్మిణమ్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Tags: Minister Peddireddy presented the Patuvala to Boyakonda Amma
