సబ్సిడీలో అందించే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రొంపిచర్ల ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.సబ్సిడీలో అందించే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.గతంలో పెండింగ్ లో ఉన్న 121 మందికి ఇంటి పట్టాలు అందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ముప్పై సంవత్సరాలు గా నివాసం ఉంటున్న పలు కాలనీల నివాసితుల ఇంటికి ప్రొవిజన్ సర్టిఫికెట్ అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..
సబ్సిడీ పై ప్రభుత్వం రైతులకు విత్తనాలు అందిస్తుంది
ఇవి మార్కెట్ లోకి పోకుండా అందరూ వినియోగించుకోవాలి
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ దుర్వినియోగం చేసుకోకూడదు
కేవలం వేరుశనగ మాత్రమే కాకుండా అనేక విత్తనాలు సబ్సిడీ పై అందిస్తున్నాం
ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారు సిఎం శ్రీ వైఎస్ జగన్
ఏ పంట వేస్తే బాగుంటుందో కూడా తెలిపేందుకు, సలహాలు ఇచ్చేందుకు సిబ్బంది ఉన్నారు
గిట్టుబాటు ధర రాని పంటల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు
మాది రైతు ప్రభుత్వం, రైతుకు మేలు చేసిందుకు అహర్నిశలు సిఎం శ్రీ వైఎస్ జగన్ స్పందిస్తున్నారు
రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అని విమర్శిస్తున్నారు
కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారు
అభివృద్ధి జరుగుతున్న వారికి అది కనపడదు
పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో తాగు సాగు నీటిని అందించాలని మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు
చంద్రబాబు వాటి నిర్మాణాలను ఆపడానికి సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి స్టే తీసుకొచ్చారు
ఇప్పటికే రెండు రిజర్వాయర్లు దాదాపు గా నిర్మాణ పనులు పూర్తి చేశాం
ఆ నిర్మాణాలు పూర్తయితే, రైతులకు, ప్రతి ఇంటికి నీరు అందుతుంది
కక్ష పూరితంగా చంద్రబాబు సుప్రీం కోర్టు కు వెళ్లి స్టే తెచ్చారు
ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, చంద్రబాబు కు చిత్తూరు జిల్లాలో డిపాజిట్ లు కూడా రావు
రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇస్తే, దానిని ఒకటిన్నర సంవత్సరం పాటు కోర్టులో అడ్డుకున్నారు
జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం లో రెండు కళ్ళు గా బావించి ముందకు సాగుతున్నారు
ప్రజలందరూ మరింత గొప్ప విజయాన్ని సిఎం వైఎస్ జగన్ కు అందించేందుకు సిద్దంగా ఉన్నారు.
Tags:Minister Peddireddy Ramachandra Reddy distributed the subsidized groundnut seeds
