Natyam ad

సదుంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

సదుం ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఎన్నికల ప్రచారంలో బాగంగా మండలంలోని ప్రతి పంచాయితీలో పర్యటన.నేడు మొత్తం 18 పంచాయతీల్లో పర్యటించనున్న మంత్రి.తాటిగుంటపాలెం పంచాయతీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం.ఇప్పటికే పుంగనూరు, చౌడేపల్లి, సోమల మండలాల్లో పూర్తయిన పర్యటన.

Post Midle

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు.సిఎం  వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు.రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసిపి ప్రభుత్వం లబ్ది చేకూర్చింది.30 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చేపట్టారు.అందులో 18 లక్షల ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది.ఆరోగ్య శ్రీ ద్వారా 3200 పైగా జబ్బులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారు.25 లక్షల రూపాయల వరకు ఉచితంగా నేడు వైద్యం అందుతుంది.రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు.కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత సిఎం  వైఎస్ జగన్ ది.

 

 

 

జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు ది. వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అని నెరవేర్చారు.600 హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మానిఫెస్టో కూడా కనపడకుండా చేశారు.బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.14 వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు.దానికి అదనంగా 10 వేల కోట్లు వడ్డీ కావడంతో సిఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు.చంద్రబాబు మన ప్రాంతంలో మొయిస్తున్న మూడు ప్రాజెక్టులు అడ్డుకున్నారు.ఎన్నికలు పూర్తి అవగానే ఆ కేసులు గెలిచి మళ్ళీ పనులు చేపడతాం.ఏడాది లోపు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం.కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు.

 

 

జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లో లో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు.హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారు.రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా   పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు.నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిథున్ను భారీ మెజారిటీతో గెలిపించాలి.కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని ప్రజలే సిద్దం గా ఉన్నారు.ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా.మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుకుంటున్నా.

     

Tags:Minister Peddireddy Ramachandra Reddy during election campaign in Sadum.

Post Midle