Natyam ad

చిత్తూరు జిల్లా లో ఏనుగులు సమస్య పై మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టి

తిరుపతి ముచ్చట్లు:

వెంటనే అదనపు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.ప్రస్తుతం జిల్లలో సేవలందిస్తున్న 11 బెస్ క్యాంపులు, ఇప్పుడు అదనంగా మరో మూడు బేస్ క్యాంపులు ఏర్పాటుకు ఆదేశం.పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇటీవల పెరిగిన ఏనుగుల బెడద.బేస్ క్యాంప్ ఏర్పాటుతో పెరగనున్న ట్రాకర్లు.బేస్ క్యాంపులు అందుబాటులోకి వస్తే ఏనుగుల సంచారం పై గ్రామస్తులకు తక్షణ సమాచారం.ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు సత్వర చర్యలకు అవకాశం.ఇప్పటికే జిల్లాలో 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తున్న అటవీ శాఖ.చిత్తూర్ జిల్లాలో మొత్తం 80 నుండి 90 ఏనుగుల సంచారం. చిత్తూరు జిల్లా లో ఏనుగులు సంచారం, మనుషుల పై దాడులు, పంట పొలాలు ధ్వంసం పై ప్రత్యేక దృష్టి సారించారు అటవీ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి, పుంగనూరు నియోజకవర్గం సోమల మండలాల్లో ఏనుగుల దాడులు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపు లు ఏర్పాటు చేసి, తద్వారా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గ్రామస్తులకు తెలియజేయడంతో పాటుగా, ఆ ఏనుగులు గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి.

 

 

 

Post Midle

ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో ఐదు, పలమనేరు ప్రాంతంలో నాలుగు, చిత్తూరు లో రెండు బేస్ క్యాంపులు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు పలమనేరు ప్రాంతంలోని పెద్దపంజాణి, పుంగనూరు ప్రాంతం సోమల మండలంలోని ఆవులపల్లి, పేటూరు ప్రాంతాల్లో కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇక్కడ బేస్ క్యాంపులు సిద్ధం అయితే ఒక్క బేస్ క్యాంప్ సుమారు 40 నుండి 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏనుగుల కదలికలు గమనించేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా మొత్తం మూడు బేస్ క్యాంపులకు కలిపి సుమారు 15 మంది ట్రాకర్లు అందుబాటులోకి రానున్నారు.

 

 

 

ట్రాకర్ల సహాయంతో ఏనుగుల కదలికలతో పాటు మిగిలిన అడవి జంతువులు కదలికలు పై కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఏదైనా గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే, ఆయా గ్రామాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా అటవీ శాఖ అధికారులు కూడా టపాసులు, డప్పులు లాంటివి సిద్ధం చేసి ఆయా గ్రామాలు వైపుకు ఏనుగుల గుంపు వెళ్ళకుండా సత్వర చర్యలు తీసుకోవడానికి ఆ సమాచారం దోహదపడుతుంది. ప్రస్తుతం పుంగనూరు రేంజ్ లో సుమారు 20 నుండి 25 ఏనుగులు సంచరిస్తున్నాయి, ఇందులో 3 మదపుటేనుగులు ఉన్నాయి. అయినా గతంలో ఎప్పుడు ఈ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పటు చేయలేదు. తాజాగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మొత్తం మూడు బేస్ క్యాంపులు ఏర్పాటుకు రంగం సిద్ధం కానుంది.

 

 

ఇక బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తే ఏనుగుల బెడద బాగా తగ్గుంతుందని, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. వీలైనంత వేగంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొత్తం చిత్తూరు జిల్లాలో సుమారు 80 నుండి 90 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ స్థాయిలో ఏనుగులను అదుపు చేయడం కొంత కష్టతరమే అయినా, మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఏనుగుల కట్టడికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు విషయంలో కూడా చర్యలు వేగం అయ్యాయి. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో 6 కిలో మీటర్లకు సోలార్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి, మరో 15 కిలో మీటర్లు సోలార్ ఫెన్సింగ్ వేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి. మరో పక్క ఎప్పటికప్పుడు ప్రాణ నష్టం, పంట నష్టాలకు సంబందించిన పరిహారాన్ని అధికారులు అందిస్తున్నారు.

 

Tags: Minister Peddireddy Ramachandra Reddy focused on the problem of elephants in Chittoor district

Post Midle