Natyam ad

ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మనదనపల్లి ముచ్చట్లు:

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం లో పాల్గొన్న విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మనదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు తదితర నియోజకవర్గాల నాయకులకు వైసిపి అభ్యర్థి  పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి ను పరిచయం చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే . పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే . చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే . నవాజ్ బాషా తదితరులు

Post Midle

మంత్రి . పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

వైసిపి అధికారం లోకి వచ్చాక మొట్టమొదటి సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ కి పోటీ చేస్తున్నాం.వైసిపి నాయకులు కోరిన మేరకే శ్యాం ప్రసాద్ రెడ్డి ని ముఖ్యమంత్రి గారు అభ్యర్థిగా ఎంపిక చేశారు.ఎమ్మెల్సీ విజయం కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరూ ఎమ్మేల్యేలు పై ఉంది.దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అనేక మంది పట్టభద్రుల అయ్యి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.తంబళ్లపల్లె లాంటి ప్రాంతాల్లో పట్టభద్రులు బెంగుళూరులో ఉంటున్నారు.ప్రతి శాసన సభ్యుడు ప్రతి ఒక్క పట్టబద్రుడిని ఓటరు లిస్ట్ లో నమోదు చేయించాలి.పాత ఓటరు జాబితా లో ఉన్నవారు కూడా మళ్ళీ ఓటు కోసం నమోదు చేసుకోవాలి.ఇప్పటికే ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రారంభమై వారం గడిచింది.గతంలో మన దగ్గర ఎక్కువ మెజారిటీ ఇచ్చి పట్టభద్రులు గా శ్రీనివాసులు రెడ్డి కి మద్దతు ఇచ్చి గెలిపించాం.ఈ సారి స్వయంగా మన పార్టీ నుండి పోటీకి నిలబడుతున్న నేపథ్యంలో భారీ విజయం నమోదు చేయాలి.టీచర్ల ఎమ్మెల్సీ లో కూడా ఇదే స్థాయిలో పని చేయాలి.ఇప్పుడు ప్రైవేట్ టీచర్లకు ఓటు హక్కు ఉంది

ఎమ్మెల్యే   పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి కామెంట్స్…..

ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తంబళ్లపల్లె నియోజకవర్గం పై నమ్మకం పెట్టుకున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయన్ సాధించాం, నియోజకవర్గానికి కావాల్సినవి అన్ని మనకు సిఎం  ఇస్తున్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా.పనులు చేసిన చేయకపోయినా అందరూ ఎన్నికల సమయంలో కలిసి పనిచేస్తున్నారు.

Tags: Minister Peddireddy Ramachandra Reddy in MLC election exercise meeting

Post Midle

Leave A Reply

Your email address will not be published.