చౌడేపల్లి లో పలు నూతన భవనాలు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చౌడేపల్లి ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లో పలు నూతన భవనాలు ప్రారంభించిన విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయం, అర్బికే భవనాలు ప్రారంభోత్సవం.అభివృద్ధి, సంక్షేమం లో రాష్ట్రం దూసుకుపోతుంది . మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.సిఎం వైఎస్ జగన్ ప్రతి ఆలోచన ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉన్నాయి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.వచ్చే ఎన్నికల్లో సిఎం శ్రీ వైఎస్ జగన్ కు ప్రజలంతా అండగా నిలవాలి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.పుంగనూరు : అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో గ్రామ సచివాలయం లాంటి అనేక విప్లవాత్మకమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శవంతంగా నిలుస్తున్నారని కొనియాడారు.

శనివారం నాడు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని పరికిదోన్న, చిన్న కంపల్లి, గడ్డంవారిపల్లి లో అంగన్వాడీ భవనాలు ప్రారంభించారు మంత్రి. అదేవిధంగా గడ్డంవారిపల్లిలో గ్రామ సచివాలయం, ఆర్భికే భవనాలను ప్రారంభించారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం అనేక రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి గ్రామ సచివాలయం, ఆర్బికే లు లాంటి వాటి పై అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి గొప్ప ఆలోచన ద్వారా ప్రజల కు అవసరమైన ఒక నూతన వ్యవస్థను, గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చారని కొనియాడారు. అనేక రాష్ట్రాలు, దేశాలు ఇప్పటికే ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్న విషయం మనకు తెలిసిందే అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ స్థాయిలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వచ్చే ఎన్నికల్లో అందరూ అండగా నిలిచి గతం కంటే గొప్ప విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
Tags:Minister Peddireddy Ramachandra Reddy inaugurated many new buildings in Chaudepally
