Natyam ad

పీలేరు లో ఏపిఎస్ఆర్టీసి డైరెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

పీలేరు ముచ్చట్లు:

పీలేరు లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపిఎస్ఆర్టీసి డైరెక్టర్ కార్యాలయాన్ని ఆదివారం నాడు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన పీలేరు ఎమ్మెల్యే   చింతల రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపి   ఎన్. రెడ్డప్ప తదితరులు.

Post Midle

మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

జగన్ మోహన్ రెడ్డి  పాదయాత్ర సమయంలో మొట్టమొదట సదుం లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు.అధికారం లోకి రాగానే ఇచ్చిన హామీని నెరవేర్చారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆర్టీసి మూత పడే సమయంలో టాక్స్ లు రద్దు చేసి ఆదుకున్నారు.అనేక నిర్ణయాలు తీసుకుని ఆర్టీసి ని తిరిగి గాడిలో పెట్టారు.ఆర్టీసి కార్మికులకు వైఎస్ కుటుంబం ఎప్పుడూ అండగా నిలిచింది.రాజా రెడ్డి  పార్టీకి చేసిన సేవను గుర్తించి సిఎం  వైఎస్ జగన్  ఆయనకు డైరెక్టర్ పదవి ఇచ్చారు.ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజరెడ్డి కృషి చేస్తారు.యూనియన్ ఎన్నికల్లో ఎలా ఉన్నా, కార్మికులు అందరూ రాష్ట్ర ఎన్నికల్లో వైసిపి కి అండగా నిలవాలి.ఇన్ని రోజులు వైసిపి కి అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్మికుడుకి ధన్యవాదాలు

 

Tags: Minister Peddireddy Ramachandra Reddy inaugurated the office of APSRTC Director in Pileru.

Post Midle