చౌడేపల్లి ముచ్చట్లు:
చౌడేపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో సమావేశాలు.ఏ.కొత్తకోట పంచాయతీ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం.కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపి శ్రీ ఎన్ రెడ్డప్ప తదితరులు.ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి వైసిపి లో చేరిన వారికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..
ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కోరుతున్నా.ప్రతి గ్రామం లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందయో ప్రజలందరికీ తెలుసు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు.చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా ?రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అందరినీ మోసం చేశారు.రాజధాని నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక రాజధానిని నిర్మించారు.సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఓటు వేయాలని కోరుతున్నారు.సంక్షేమ పథకాలు వలన రాష్ట్రం శ్రీలంక గా మారిందని చంద్రబాబు విమర్శించారు.పథకాల వలన రాష్ట్రం దివాలా తీస్తుందని అన్న వ్యక్తి 2.5 లక్షల కోట్లతో సూపర్ సిక్స్ అమలు చేస్తారా ?చంద్రబాబు రైతులను మోసం చేస్తే…. శ్రీ వైఎస్ జగన్ రైతులకు అండగా నిలబడ్డారు.ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా మన గ్రామంలోనే సచివాలయం ను తీసుకొచ్చారు.
అర్హులైన టిడిపి కార్యకర్తలకు, నాయకులకి కూడా సంక్షేమ పథకాలు అందించాం.జన్మభూమి కమిటీలో ఇంత నిబద్దత తో పని చేశాయా?.ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు.నాడు నేడు ద్వారా పూర్తి స్థాయిలో పాఠశాలల అభివృద్ది జరిగింది.చంద్రబాబు మానిఫెస్టో లో ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కార్ అని కూడా అంటారు.ఆ హామీలు సద్యమైనవా కదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి.వైసిపి హయాంలో ప్రతి కుటుంబానికి లబ్ది జరిగింది.ప్రజలు ఆలోచన చేసి సీఎం వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలి.మే 13 న జరిగే ఎన్నికల్లో వైసిపి ఫ్యాను గుర్తు పై తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరుతున్నా.
Tags:Minister Peddireddy Ramachandra Reddy participated in the election campaign