Natyam ad

నూతన సాగునీటి ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సొమల ముచ్చట్లు:

సొమల మండలం ఆవులపల్లి గ్రామం సమీపంలో నూతన సాగునీటి ప్రాజెక్టు కు శుక్రవారం భూమి పూజ చేసిన విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,స్వర్ణలత దంపతులు.కార్యక్రమం లో పాల్గొన్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే   పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ   ఎన్. రెడ్డప్ప, ఇరిగేషన్ అధికారులు. సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ సీతమ్మ చెరువు వద్ద ఆవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూమి పూజ చేయుటకు 08.20 am లకు వచ్చారు. రిజర్వాయర్ పొడవు/ కట్ట 815 మీటర్లు, మాక్సిమం ఎత్తు 55 మీటర్లు, నీటి కెపాసిటీ 3.5 టిఎంసి, సుమారు 1300 ఎకరాలు అవసరము, అందులో ప్రస్తుతానికి 240 ఎకరముల ప్రభుత్వ భూమిని ప్రాజెక్టు కొరకు ఇచ్చారు, మిగిలిన భూమిని సేకరించవలసి ఉంది. ప్రభుత్వ సమాచారం మేరకు మూడు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి, అవి రామకృష్ణాపురం, భయ్యా రెడ్డిపల్లి, చిన్న దేవల కుప్పం @ 170 కుటుంబాలు. ప్రాజెక్టుకు 667.2 కోట్ల రూపాయలు మతింపుగా కలదు. ప్రస్తుతానికి ప్రభుత్వం వారు పునరవాసము కింద 84 కోట్లు మంజూరు చేసినారు, అవసరమైతే ఇంకనూ సాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టును నవయుగ అండ్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు (జాయింట్ వెంచర్)నిర్మిస్తున్నారు.

Post Midle

 

Tags: Minister Peddireddy Ramachandra Reddy performed Bhumi Puja for the new irrigation project

Post Midle