Natyam ad

క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్

– అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన దురదృష్టకరం
– విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఎందుకు దృష్టి పెట్టలేదు?
– ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపైనా సీరియస్ గా స్పందించాలి
– విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ 1912
– ప్రతి సచివాలయంలోనూ ఈ నెంబర్ ను ప్రదర్శించాలి
– విద్యుత్ తీగల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఇకపై ఉండకూడదు
– భద్రతపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం
– ఎఇ, లైన్ మెన్లు ఫీల్డ్ లెవల్ లో పర్యటించి పరిస్థితులను అంచనా వేయాలి
– కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎస్ఇలు బాధ్యత తీసుకోవాలి
– ఉన్నతాధికారులు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలి
– నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
– ఈ నెలాఖరు లోగా పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ల ప్రక్రియ పూర్తి కావాలి
– ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో వచ్చే సమస్యలపై తక్షణం స్పందించాలి

: మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన దురదృష్టకర ఘటనలో అమాయక కూలీలు మృత్యువాత పడటం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటన మరోసారి పునరావృతం కాకూడదని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో గురువారం వీడియోకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన తక్షణమే అధికారులు స్పందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలు 1912 టోల్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ నెంబర్ పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అన్ని సచివాలయాల్లోనూ ఈ నెంబర్ తో కూడిన వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు.చిన్న సమస్య అయినా ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించే అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, వాటిని పరిష్కరించాలని సూచించారు. అధికారులు హెడ్ క్వార్టర్స్ లోనే ఖచ్చితంగా ఉండాలని కోరారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్కరికి ప్రాణహాని కలిగినా మొత్తం డిపార్ట్ మెంట్ కు చెడ్డపేరు వస్తుందని, బాధ్యతతో పనిచేయడం ద్వారా ఇటువంటి ఘటనలు జరగకుండా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

 

విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని, క్రమం తప్పకుండా ఈ కమిటీలు అన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తాయని అన్నారు. కిందిస్థాయిలో లైన్ మెన్, విద్యుత్ ఎఇలు క్షేత్ర పర్యటనలు చేయాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే వాటిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ రంగంకు సంబంధించి కర్నూలు, అనంతరపురం జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంత నిర్లక్ష్యానికి గురయ్యాయని, పాత విద్యుత్ లైన్లను సకాలంలో మార్చకపోవడం, ఆధునీకరణ చేపట్టకపోవడం వల్ల లైన్లు తెగిపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. వెంటనే ఈ రెండు జిల్లాల ఎస్ఇ, ఇఇ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లైన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించేందుకు ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నెలాఖరు నాటికి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్ ను ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డిబిటి కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు ఖాతాలను ప్రారంభించడం, ఆధార్ అప్ డేట్ చేయడంను మరింత వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని కోరారు.వీడియో కాన్ఫెరెన్స్ లో ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, పలు జిల్లాలకు చెందిన ఎస్ఇ, ఇఇలు పాల్గొన్నారు.

Tags: Minister Peddireddy Ramachandra Reddy video conference with the officials of the power department at the camp office

Post Midle