సదుం లో రెండో రోజు 41 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సదుం ముచ్చట్లు:
15 రోజుల్లో 500 పైగా పల్లెలు పర్యటించి, ప్రజా సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మండలం లో రెండు రోజుల్లో 74 పల్లెలు పర్యటించిన మంత్రి.మంగళవారం నాడు మండలంలోని బూరగమంద, జోగివారిపల్లి, చెరుకువారిపల్లి, నడిగడ్డ పంచాయతీల పరిధిలోని 41 పల్లెలు పర్యటించారు మంత్రి.ఇప్పటికే నియోజకవర్గం లొని పుంగనూరు, చౌడేపల్లి, సోమల మండలాల్లో పూర్తయిన పల్లెబాట కార్యక్రమం.నియోజకవర్గం లో 15 రోజులు పాటు మొత్తం 535 పల్లెలు పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించిన మంత్రి, ఇతర సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కామెంట్స్…..
పదవుల్లో కాదు, ప్రజా సమస్యల పరిష్కారం లోనే సంతృప్తి.ప్రజల అభివృద్దే నా ధ్యేయం.శాబ్దాలుగా నన్ను ఆదరించి, నావెంట నడుస్తున్నారు.నియోజకవర్గం అభివృద్ధి లో పరుగులు పెడుతుంది.500 లకు పైగా పల్లెలు సందర్శించడం నా అదృష్టం.కరోనా మహమ్మారి లేకుంటే గతంలో లాగా ప్రతి ఏడాది రెండు సార్లు పల్లెబాట నిర్వహించేవాడిని.అభివృద్ధి విషయంలో పుంగనూరు నియోజకవర్గం కు సిఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత.కరోనా సమయంలో కూడా మనకు లోటు లేకుండా చూసుకున్న ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం.సిఎం కు అందరూ అండగా నిలిచి, మరోసారి భారీ విజయాన్ని అందించాలి.పుంగనూరు : తనకు పదవుల కంటే, ప్రజా సమస్యల పరిష్కారంలో నే సంతృప్తి ఉంటుందని అన్నారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నియోజవర్గం లో గత 15 రోజులుగా పల్లెబాట నేపద్యంలో 500కు పైగా పల్లెల్లో పర్యటన పూర్తి చేసిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు మంత్రి. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం లో రెండో రోజు 41 పల్లెలు పర్యటించారు మంత్రి. మండలం లో రెండు రోజుల్లో 74 పల్లెలు పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించారు. మంగళవారం నాడు మండలంలోని బూరగమంద, జోగివారిపల్లి, చెరుకువారిపల్లి, నడిగడ్డ పంచాయతీల పరిధిలోని పల్లెలో పర్యటన సాగింది. ఇప్పటికే నియోజకవర్గం లొని పుంగనూరు, చౌడేపల్లి, సోమల మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తయింది. నియోజకవర్గం లో 15 రోజులు పాటు మొత్తం 535 పల్లెలు పర్యటించారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటుగా, ఇతర సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనకు పదవులకంటే, ప్రజా సమస్యల పరిష్కారం లోనే సంతృప్తి ఉందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్దే తన ధ్యేయం అని, దశాబ్దాలుగా తనను ఆదరించి, పుంగనూరు నియోజకవర్గం ప్రజలు తన వెంట నడుస్తున్నారని తెలిపారు. 500 పైగా పల్లెలు సందర్శించి, ప్రజా సమస్యలు పరిష్కరించడం తన అదృష్టం అని పేర్కొన్నారు మంత్రి. గతంలో ఏడాదికి రెండు సార్లు పల్లెబాట నిర్వహించేవాడినని, కరోనా కారణంగా మధ్యలో నిలిచినా, ఆ తర్వత ఇది రెండో పర్యటన అని తెలిపారు. సిఎం శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, నియోజకవర్గం అభివృద్ధి లో పరుగులు పెడుతుందని, అభివృద్ధి విషయంలో పుంగనూరు నియోజకవర్గం కు సిఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. తన సొంత నియోజకవర్గం నుండి పుంగనూరు ప్రాంతానికి నీరు అందించేందుకు చేసిన కృషే ముఖ్యమంత్రి నిబద్ధతకు నిదర్శనం అన్నారు. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల్లో బెడ్లు లేక అల్లాడుతున్న పరిస్థితులు చూశామని, కానీ మనకు అలాంటి పరిస్థితి రాకుండా సిఎం అండగా నిలబడ్డారని అన్నారు. అటువంటి సమయంలో కూడా మనకు లోటు లేకుండా చూసుకున్న ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టమని, సిఎం కు అందరూ అండగా నిలిచి, మరోసారి భారీ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరికలు
మంగళవారం పల్లెబాట లో బాగంగా అనేక మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వివిధ పల్లెలు నుండి మొత్తం 35 మందికి పైగా వైసీపీలో చేరారు. వారికి వైసిపి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గాదెవారిపల్లి లో అత్యధికంగా 27 మంది వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.
ప్రారంభోత్సవాలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సదుం మండలంలో రెండో రోజు పర్యటన లో బాగంగా పలు ప్రారంభోత్సవాలు చేశారు. మొరవపల్లి, బూరగమంద, దేవదారుమాకులపల్లిలో అంగన్వాడి భవనాలు, బూరగమంద, నడిగడ్డలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్, సీతన్నగారిపల్లిలో గ్రామ సచివాలయ భవనం, జొగివారిపల్లిలో ఆర్బికే భవనాలు ప్రారంభించారు.
ఇళ్ల పట్టాలు పంపిణీ
బూరగమంద పంచాయతీ పరిధిలోని కొత్తవడ్డిపల్లికి గ్రామానికి చెందిన 18 కుటుంబాలు అనేక సంవత్సరాలు గా బూరగమందలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి పల్లకీ మోస్తూ, దేవాదాయ డికేటి భూముల్లో నివసిస్తున్నారు. గతంలో వారి సమస్యలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తేవడంతో వెంటనే సానుకూలంగా స్పందించి ఆ సమస్య పరిష్కరించాలని భావించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు వారు నివాసం ఉంటున్న స్థలాలకు సంబందించిన అధీకృత పాత్రలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. తాము విన్నవించిన వెంటనే వారి జీవితకాల సమస్య ను పరిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వారంతా రుణపడి ఉంటామని, కృతజ్ఞతలు తెలిపారు.
Tags; Minister Peddireddy Ramachandra Reddy visited 41 villages on the second day in Sadum
