Natyam ad

పుంగనూరు నియోజకవర్గంలో పల్లెబాట పూర్తి చేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సదుం ముచ్చట్లు:

నాలుగు రోజులు పాటు 136 పల్లెలు పర్యటించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.గురువారం నాడు మండలంలోని యర్రాతివారిపల్లి, రెడ్డివారిపల్లి, తాటిగుంటపాళ్యం, సదుం, కంభంవారిపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని 24 పల్లెల్లో పర్యటించిన మంత్రి .నేటితో పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాల్లో పల్లెబాట పూర్తి చేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మొత్తం 17 రోజులపాటు పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో మొత్తం 597 పల్లెలు పర్యటించిన మంత్రి .సదుం మండలం లో నాలుగో రోజు పర్యటనలో బాగంగా గాండ్లపల్లిలో ఆర్బీకే,  పుట్టావారిపల్లి, బట్టువారిపల్లి లో అంగన్వాడి, సదుం, గాండ్లపల్లిలో సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించారు. నాలుగు రోజులు పర్యటన లో బాగంగా మండలం లో మొత్తం పదమూడు అంగన్వాడి భవనాలు, ఐదు వైఎస్సార్ హెల్త్ సెంటర్, నాలుగు ఆర్బీకే, నాలుగు సచివాలయ, ఒక బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ భవనాలు ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.పల్లెబాట కార్యక్రమంలో వైసిపిలోకి భారీగా కొనసాగిన చేరికలు

 

 

Post Midle

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.

 

నాలుగు మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి అయ్యింది.ప్రజలందరిని కలిసి, వారి సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది .ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉన్నా, నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తా.అనేక సంవత్సరాలు గా పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నా, గతంలో లాగా ఇప్పుడు పెద్దగా సమస్యలు పై ఫిర్యాదులు అందట్లేదు.సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయ్యాక, అనేక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది.ఇలాంటి గొప్ప విప్లవాత్మక ఆలోచన చేసిన ఘనత సిఎం జగన్ దే.దేశం లో ఎక్కడా లేని విధంగా అనేక గొప్ప అలోచనలతో పరిపాలన సాగిస్తున్నారు.ఇతర రాష్ట్రాలకు సిఎం ఆదర్శంగా నిలుస్తున్నారు.నాడు నేడు, అమ్మఒడి లాంటి పథకాలతో ప్రజలకు అవసరమైన విద్య, వైద్య రంగాల పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.ప్రజలు, నియోజకవర్గం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తా.త్రాగు, సాగు నీరు అందించడానికి ఇప్పటికే పనులు ప్రారంభించాం.ఇప్పటికే నియోజకవర్గం లో వేసిన రోడ్లు, నిర్మించిన డ్రెయిన్లు చూసి ప్రజలు అభినందిస్తున్నారు

 

 

పుంగనూరు : దేశం లో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన ఆలోచనలతో సిఎం  వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారు అని అన్నారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో మంత్రి చేపట్టిన పల్లెబాట కార్యక్రమం గురువారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సిఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా పథకాలు సుపరిపాలన సాగిస్తున్నారని తెలిపారు మంత్రి.సదుం మండలంలో నాలుగు రోజులు పాటు 136 పల్లెలు పర్యటించారు మంత్రి. గురువారం నాడు మండలంలోని యర్రాతివారిపల్లి, రెడ్డివారిపల్లి, తాటిగుంటపాళ్యం, సదుం, కంభంవారిపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని 24 పల్లెల్లో పర్యటించారు. దీంతో పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాల్లో పల్లెబాట పూర్తి అయ్యింది. 17 రోజులపాటు పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో మొత్తం 597 పల్లెల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించారు మంత్రి. సదుం మండలం లో నాలుగో రోజు పర్యటనలో బాగంగా గాండ్లపల్లిలో ఆర్బీకే,  పుట్టావారిపల్లి, బట్టువారిపల్లి లో అంగన్వాడి, సదుం, గాండ్లపల్లిలో సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించారు. నాలుగు రోజులు పర్యటన లో బాగంగా మండలం లో మొత్తం పదమూడు అంగన్వాడి భవనాలు, ఐదు వైఎస్సార్ హెల్త్ సెంటర్, నాలుగు ఆర్బీకే, నాలుగు సచివాలయ, ఒక బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ భవనాలు ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరోపక్క పల్లెబాట కార్యక్రమంలో వైసిపిలోకి భారీగా చేరికలు జరిగాయి. అనేక పల్లెల్లో మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వందమందికి పైగా పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి.

 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి అయ్యిందని, ప్రజలందరిని కలిసి, వారి సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉన్నా, తన  దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. తనకు దశాబ్దాలుగా అండగా నిలిచిన ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గం లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలన్న ఆలోచన ఎప్పటి నుండో కలగానే మిగిలిందని, ఇప్పుడు ఆ కల వాస్తవ రూపం దాల్చిందన్నారు. ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం సాగుతుందని, త్వరలో పుంగనూరు, తంబళ్లపల్లెలో నిర్మాణం లో ఉన్న మూడు ప్రాజెక్టులు పూర్తయితే సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం నుండి మనకు నీరు అందుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గం లో వేసిన రోడ్లు, నిర్మించిన డ్రెయిన్లు చూసి ప్రజలు అభినందిస్తున్నారని వివరించారు.

 

అదేవిధంగా అనేక సంవత్సరాలు గా తాను పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నా, గతంలో లాగా ఇప్పుడు పెద్దగా సమస్యలు పై ఫిర్యాదులు అందట్లేదని అన్నారు మంత్రి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయ్యాక, అనేక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఇలాంటి గొప్ప విప్లవాత్మక ఆలోచన చేసిన ఘనత సిఎం శ్రీ వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా అనేక గొప్ప అలోచనలతో పరిపాలన సాగిస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సచివాలయాలు మాత్రమే కాకుండా ఆర్బికేలు, వెల్ నెస్ సెంటర్లు ఇలా అనేక వినూత్నమైన, విప్లవాత్మకమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు విద్య, వైద్య రంగాలు చాలా ముఖ్యమని అన్నారు మంత్రి. ఆ రంగాలపై గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టి సారించారని, ఇప్పుడు తండ్రి కంటే ఒక అడుగు ముందుకు వేసి, నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలకు ఇన్ని సంవత్సారాలు గా పట్టిన దుమ్మును దులిపి, కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా తీర్చిదిద్దారని అన్నారు. నాడు నేడు తో పాటు అమ్మఒడి, విద్యా దీవెన, విద్య కనుక, జగనన్న గోరు ముద్ద, ట్యాబ్లు పంపిణీ లాంటి పథకాలు అమలు చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు, ఆరోగ్య శ్రీ లాంటివి అమలు చేస్తూ ప్రజల శ్రేయస్సు కోసం సిఎం శ్రీ వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసదుం మండలంలో నాలుగో రోజు జరిగిన పల్లెబాట కార్యక్రమంలో చిత్తూరు ఎంపి  ఎన్ రెడ్డప్ప తో పాటుగా, అనంతపురం ఎంపి   తలారి రంగయ్య, టిటిడి బోర్డ్ సభ్యులు  పోకల అశోక్ కుమార్, వైసిపి నాయకులు  ఎం.ఆర్.సి రెడ్డి పాల్గొన్నారు.

 

Tags:Minister Peddireddy Ramachandra Reddy who completed the village tour in Punganur constituency

Post Midle