Natyam ad

భూమి ఆధీనంలో ఉన్న వారికి అనుభవ ధృవ పత్రాలు అందించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:

అనేక ఏళ్లుగా భూమి ఆధీనంలో ఉన్న వారికి అనుభవ ధృవ పత్రాలు అందించిన విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.37 మంది ఎస్టీ లకు సుమారు 100 ఎకరాలకు సంబంధించి అనుభవ ధృవ పత్రాలు అందజేత.మిగిలిన ఎస్టీలకు త్వరలోనే అనుభవ ధృవ పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి.వారంలో సర్వే నిర్వహించి పత్రాలు అందచేసేలా చర్యలు.దేవస్థాన భూముల్లో ఇల్లు నిర్మాణం చేసుకుని మూడు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 30 మందికి అనుభవ ధృవ పత్రాలు.  నియోజకవర్గంలోని చౌడేపల్లి లో దేవస్థానం భూముల్లో ఇల్లు నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి, అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటున్న సుమారు 30 మంది ఎస్టీ లకు అనుభవ ధృవ పత్రాలను అందించారు విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం నాడు చౌడేపల్లి లోని ఎంపీడీఓ కార్యలయం లో జరిగిన పత్రాలు పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు మంత్రి.

 

 

చౌడేపల్లి లో సుమారు గా 30 ఏళ్లుగా నివాసం ఉంటూ భూమి తమ ఆధీనంలో లేకపోవడం తో ఆ ప్రాంతానికి చెందిన 37 కుటుంబాలు గతంలో తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సరైన విధానాల ద్వారా వారికి అనుభవ ధృవ పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారందరికీ శనివారం నాడు స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన చేతులు మీదుగా వారికి పత్రాలు అందించారు.అదేవిధంగా మండలం లోని దిగువపల్లి లో అనేక ఏళ్లుగా ఎస్టీ వర్గానికి చెందిన వారు వ్యవసాయం కోసం భూమిని వినియోగిస్తున్నారు. అయితే వారికి కూడా భూమి తమ ఆధీనంలో లేకపోవడం తో వారు సమస్య పైన మంత్రి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సుమారు 100 ఎకరాలకు సర్వే నిర్వహించిన అధికారులు ఆ భూమి మొత్తం 37 మంది ఆధీనంలో ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో వారికి అనుభవ ధృవ పత్రాలు అందించాలని గతంలో మంత్రి ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు మొత్తం 37 మందికి 100 ఎకరాలకు సంబందించిన అనుభవ ధృవ పత్రాలు మంత్రి చేతులు మీదుగా అందుకున్నారు. మిగిలిన భూమిని సైతం త్వరగా సర్వే నిర్వహించి ఎవరి అనుభవంలో ఉందో తేల్చాలని అధికారులను ఆదేశించారు మంత్రి.

 

 

Post Midle

ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దాదాపు 100 ఎకరాలు షికారుపాలెం కు చెందిన వారికి అనుభవ పత్రాలు అందించామన్నారు. ఇంకా సుమారు 150 ఎకరాలు వరకు ఇవ్వాల్సి ఉందని, వాటిని వారంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా అనేక మంది దేవస్థాన భూముల్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నారని, కానీ వారెవ్వరు కి హక్కు లేకుండా పోయిందన్నారు. వారికి కూడా ఇప్పుడు అనుభవ ధృవ పత్రాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి.

 

Tags: Minister Peddireddy Ramachandra Reddy who gave experience certificates to the land owners

Post Midle