పుంగనూరులో పాఠశాలలకు నాడు-నేడు తో మహార్ధశ – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-సంక్షేమ సారధి వైఎస్.జగన్మోహన్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకంతో పాఠశాలలకు మహార్ధశ పట్టిందని , రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి, సంక్షేమ సారధిగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి కీర్తిగడించారని రాష్ట్ర అటవీ,గనుల, ఇంధన శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పుంగనూరు మండలంలోని గూడూరుపల్లె హైస్కూల్లో రూ.1.35 కోట్లతో నిర్మిస్తున్న అదనపు పాఠశాల గదుల నిర్మాణానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్‌తో కలసి శంఖుస్థాపన చేశారు . మంత్రి మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి సుమారు రెండు విడతలలో రూ.70 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా మెను తయారు చేసి, దాని ప్రకారం భోజన పథకం కొన సాగించడం జరుగుతోందన్నారు. అలాగే పాఠశాలల్లోని విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవేన పథకాలను ఆతల్లులకు అందించి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయడం జరిగిందన్నారు. ఏప్రభుత్వము చేయనివిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళకాలంలో ఎనలేని అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి తాగునీరు-సాగునీరు అందించేందుకు మూడు రిజర్వాయర్లను నిర్మించడం జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ వారు అభివృద్ధి చేయలేదని ఆరోపించడం అవివివేకమన్నారు. ఈకార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ నాగభూషణం, జెడ్పిటిసి జ్ఞాన ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Tags: Minister Peddireddy Ramachandrareddy – Mahardhasa with day-to-day for schools in Punganur
