పుంగనూరు ఆర్టీసి బస్సులో మంత్రి పెద్దిరెడ్డి ప్రయాణం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నుంచి పెద్ద ఉప్పరపల్లె, అక్కడి నుంచి తిరుపతికి పల్లెవెలుగు బస్సును మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కలసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, కలెక్టర్ హరినారాయణ్, ఎమ్మెల్యేలు ఆదిమూలం, జంగాలపల్లె శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ లు టికెట్లు కొని కొద్దిదూరం ప్రయాణం చేశారు. మంత్రి పెద్దిరె డ్డి మాట్లాడుతూ పుంగనూరులో డిపో ఏర్పాటు చేసి , అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రజలు ఆర్టీసి బస్సులో సురక్షిత ప్రాయాణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎం సుధాకరయ్య, ఆర్టీసి మజ్దూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఆర్టీసి నాయకులు కరీముల్లా, మల్లేశ్వర్‌రెడ్డి, గౌరిశంకర్, గంగాధర్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minister Peddireddy travels in Punganur RTC bus