పుంగనూరులో బాధితులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని మేలుపట్లలో నివాసం ఉన్న విశ్రాంత సైనికుడు సుధాకర్‌రెడ్డి కుటుంభాన్ని బుధవారం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప కలసి పరామర్శించారు. గత వారం సుధాకర్‌రెడ్డి కుమారుడు తేజవిష్ణువర్ధన్‌రెడ్డి వ్యాయమం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, వైఎస్సార్‌సీపీ నాయకుడు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Minister Peddireddy visited the students in Punganur

Leave A Reply

Your email address will not be published.