రైతుల అభివృద్దే సింగిల్‌విండో లక్ష్యం-ఆదర్శ సింగిల్‌విండోగా పేరుతేవాలన్న మంత్రి పెద్దిరెడ్డి

-మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– అట్టహాసంగా చైర్‌పర్సన్‌ , సభ్యులచే ప్రమాణస్వీకారం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

రైతుల అభివృధ్దే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తోపాటు సింగిల్‌ విండోల లక్ష్యమని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో సింగిల్‌విండో చైర్‌పర్సన్‌ రవిచంద్రారెడ్డి, సభ్యులు రమేష్‌బాబు, యోగానంద త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరైయ్యారు.ఈ సంధర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ్యధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, రైతుల ముంగిట్లోకి ప్రభుత్వ సేవలందించాలనే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆధునిక సేవలందిస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. ఆర్థికంగా రైతులను పోత్సహిస్తు, కొత్తపంటలపై రైతులు దృష్టి పెట్టేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. సింగిల్‌విండో ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు సకాలంలో తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ సేవలందించి జిల్లాలోనే ఆదర్శ సింగిల్‌విండో గా గుర్తింపు తేవాలని నూతన కమిటీకు సూచించారు.అనంతరం మంత్రి పెద్దిరెడ్డి కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ కౌన్సిల్‌మెంబరు మత్యంశెట్టి విశ్వనాథం, పోకల అశోక్‌ కుమార్‌,బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ దామోదరరాజు, మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి ,బోయకొండ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, నేతలు పద్మనాభరెడ్డి,మాజీ ఎంపీపీ, రెడ్డిప్రకాష్‌,సర్పంచ్‌ వరుణ్‌,బిసి కార్పొరేషన్‌ డైరక్టర్‌ లడ్డూరమణ,నాయుని సుధాకర్‌మూర్తి,ఎంపీటీసీలు సుధాకర్‌రెడ్డి,రూపారేఖ, కళ్యాణ్‌భరత్‌, అల్తాఫ్‌ ,చెంగారెడ్డి, చిన్నప్ప, రమణ, నాగరాజ, తదితరులున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Minister Peddireddy wants single window of farmers’ development to be named as’ ideal single window ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *