Natyam ad

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి 

పుంగనూరు ముచ్చట్లు:

జగనన్నే మా భవిష్యత్తు …. నువ్వే మా నమ్మకం జగన్‌ కార్యక్రమాన్ని శుక్రవారం  రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో ప్రారంభించారు.  జగనన్నే మాభవిష్యత్తు రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్‌ శివశంకర్‌రెడ్డి తో కలసి మంత్రి ఇంటింటికి వెళ్లి లభ్ధిదారులతో చర్చించారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై లభ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి గల వ్యత్యాసాలను వివరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్లు, డోర్‌ స్టికర్లు, ఫోన్‌ స్టికర్లు వేసి మిస్‌డ్‌కాల్‌ ఇప్పించారు. లబ్ధిదారులతో కలసి డోర్‌ స్టిక్కర్లు  మంత్రి స్వయంగా అతికించారు. ఈ కార్యక్రమంలో టీటీడి బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు జింకావెంకటాచలపతి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్బోర్డు చైర్మన్‌ అమ్ము, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, సచివాలయ  కన్వీనర్లు కొత్తపల్లి చెంగారెడ్డి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Minister Peddireddy who launched the Jagananne Maa Future programme

Post Midle