వి.కోట మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి
వి.కోట ముచ్చట్లు:
వి.కోట మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.మొదట పట్టణంలోని వైఎస్సార్ కూడలిలో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్నీ ఆవిష్కరించారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వి.కోట పంచాయతీ బస్టాండ్ ప్రాంగణంలో జడ్పి నిధులతో నిర్మించిన సిసి రోడ్డును, పంచాయతీ నిధులతో నిర్మించిన డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.అనంతరం మండలపరిధిలోని పురాతన ఆలయం కృష్ణమ్మ కొండకు చేరుకొని శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని, పూజలో పాల్గొన్నారు. అలాగే ఆలయ ప్రాంతాన్ని పరిశీలించారు.కార్యక్రమంలో వారితో పాటు జడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు) , ఎంపి రెడ్డప్ప, ఎమ్మెల్యే ఎన్.వెంకటేగౌడా , ఎమ్మెల్సీ భరత్ , డిసిసిబి చైర్పర్సన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి , ఎంపిపి యువరాజ్ , సర్పంచ్ పి.ఎన్.లక్ష్మీ , పి.ఎన్. నాగరాజ, రోడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్ , జడ్పి ప్రత్యేక ఆహ్వానితులు గౌస్ , వైస్ ఎంపిపిలు, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపిటిసిలు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైకాపా కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Tags: Minister Peddireddy who participated in various programs in V.Kota zone
