పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం మండలంలోని మేలుందొడ్డిలో నూతనంగా నిర్మించిన సచివాలయం, ఆర్‌బికె, వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించనున్నారు. బుధవారం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పెద్దిరెడ్డి చే సుమారు కోటిరూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. అలాగే పట్టణంలో రూ.25 లక్షలతో నిర్మించిన షాదీమహాల్‌ను మంత్రి ప్రారంభిస్తారు. మంత్రి తొలుత హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, పట్టణంలో పలు ప్రాంతాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని భాస్కర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ నాయకులు సురేంద్రరెడ్డి, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
Tags: Minister Peddireddy will inaugurate the RBK Secretariat in Punganur on 14th